సైన్స్‌ సెంటర్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సెంటర్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ప్రారంభం

Mar 6 2026 8:23 AM | Updated on Mar 6 2026 8:23 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా సైన్స్‌ సెంటర్‌కు ఉపయుక్తంగా ఉండేలా ‘సైన్స్‌ సెంటర్‌ విజిట్‌ మానటరింగ్‌ యాప్‌’, ‘ప్రత్యేక వెబ్‌సైట్‌’ను అగస్త్య ఫౌండేషన్‌ సీఈఓ పుష్ప, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప మాట్లాడారు. తాడిపత్రిలోని సీవీ రామన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సీఎస్‌సీ తృతీయ సంవత్సరం విద్యార్థి చాంద్‌ హఫీజ్‌ నవాజ్‌ ‘జిల్లా సైన్స్‌ సెంటర్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌’, ‘వెబ్‌సైట్‌’ను రూపొందించడం గర్వకారణమన్నారు. నూతన ఆవిష్కరణ ఆలోచనలతో ఉన్న విద్యార్థులు జిల్లా సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ బాలమురళీకృష్ణను కలవాలన్నారు. వారిలోని విభిన్న ఆలోచనలు కార్యరూపం దాల్చేలా ఆయన కృషి చేస్తారని తెలిపారు. డీఈఓ ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ.. చాంద్‌ హఫీజ్‌ ఆలోచ సరళిని ప్రశంసించారు. సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ మాట్లాడుతూ.. సైన్స్‌ సెంటర్‌కు చాంద్‌ హఫీజ్‌ నవాజ్‌ తరచూ వస్తుండేవాడని, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి ప్రాజెక్టును అప్పగించినట్లు వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ప్రాజెక్టును, అనుకున్న దానికంటే చాలా గొప్పగా రూపొందించడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement