●పేదల పెన్నిధికి పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

●పేదల పెన్నిధికి పెద్ద కష్టం

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:22 AM

ఫోన్‌ చేస్తే చాలు నిమిషాల్లోనే చేరుకుని ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే పేదల పెన్నిధి 108కు పెద్ద కష్టం వచ్చి పడింది. చంద్రబాబు సర్కారు చిన్నచూపు

కారణంగా ఆ వ్యవస్థకే గ్రహణం పట్టింది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. గురువారం అనంతపురం నగరం నుంచి రాప్తాడు వైపు వెళ్తున్న ఓ 108 వాహనం రుద్రంపేట సమీపంలో నడిరోడ్డుపై ఆగిపోయింది. డ్రైవరు ఎన్నిమార్లు ప్రయత్నం చేసినా ఇంజిన్‌ స్టార్ట్‌ కాలేదు. దీంతో సమీపంలో ఉన్న ప్రజలు తలా ఒకచేయి వేసి వాహనాన్ని పక్కకు తోశారు. చంద్రబాబు ప్రభుత్వం 108 వాహనాల గురించి పెద్దగా పట్టించుకోని కారణంగా ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు చర్చించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలిస్తున్న

సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అని వాపోయారు.

– అనంతపురం ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement