స్వచ్ఛతా సేవలో సత్యసాయి భక్తులు
పుట్టపర్తి అర్బన్: ‘అందరినీ ప్రేమించు..అందరినీ సేవించు’ అన్న సత్యసాయి సూక్తిని ఆయన భక్తులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి విచ్చేసిన పలువురు విదేశీయులు శుక్రవారం సామాజిక సేవలో తరించారు. సుమారు నెలన్నర నుంచి పుట్టపర్తిలో వసతి గదుల్లో ఉంటున్న రష్యా, కజికిస్తాన్ తదితర దేశాలకు చెందిన 15 మంది బాబా భక్తులు సత్యసాయి బాబా నడయాడిన చిత్రావతి నదిలో శుభ్రం చేశారు. చెత్తా చెదారం, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, మురిగిపోయిన అట్టపెట్టెలు, కవర్లు తొలిగించారు. స్వచ్ఛ చిత్రావతికి విదేశీయులు చేస్తున్న కృషిని చూసి స్థానికులు కూడా స్ఫూర్తి పొందారు. తాము కూడా స్వచ్ఛ చిత్రావతికి శ్రీకారం చుడతామని తెలిపారు.
చిత్రావతిని శుభ్రం చేసిన
రష్యా, కజికిస్తాన్ దేశస్తులు
స్వచ్ఛతా సేవలో సత్యసాయి భక్తులు


