ఆలరించిన ‘సాయి కథ’
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాల్యం...అవతార వైభవం..సేవా, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు, సిబ్బంది ‘సాయి కథ’ పేరుతో కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ కొందరు గీతాలు ఆలపించగా..మరికొందరు అత్యాధునిక సంగీత వాయిద్యాలతో భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించారు.
అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
రాప్తాడు: అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని హార్టికల్చర్ అధికారులకు జేసీ శివ్ నారాయణ శర్మ సూచించారు. శనివారం గొందిరెడ్డిపల్లిలో రైతు మిడతల శీనయ్య అరటికి గిట్టుబాటు ధర లేదని 3 ఎకరాల్లో పంట తొలగించాడు. విషయం తెలుసుకున్న జేసీ శివ్ నారాయణ శర్మ, హర్టికల్చర్ అధికారులతో కలిసి గొందిరెడ్డిపల్లిలో తొలగించిన అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అరటి రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి నివేదిక పంపి గిట్టుబాటు ధరతో పాటు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో డీడీ ఉమాదేవి, తహసీల్దార్ విజయ కుమారి పాల్గొన్నారు.
ఆలరించిన ‘సాయి కథ’
ఆలరించిన ‘సాయి కథ’


