అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌

Aug 30 2025 8:00 AM | Updated on Aug 30 2025 8:00 AM

అర్హు

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌

అనంతపురం అర్బన్‌: అర్హులైన దివ్యాంగులందరికీ పింఛను అందజేస్తామని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు అప్పీలు చేసిన దివ్యాంగులందరికీ సెప్టెంబరు 1వ తేదీన పింఛను చెల్లిస్తారన్నారు. దివ్యాంగుల పింఛన్ల అంశంపై శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆత్మారాంతో కలసి విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలిక సర్టిఫికెట్‌ కలిగిన 2,123 మందికి, ఎంఆర్‌, ఎంఐ ఉన్న 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 35 మంది పిల్లలకు, 40 శాతం కంటే తక్కువ ఉండి అప్పీలు చేసుకున్న 5,241 మందికి పింఛను కొనసాగుతుందన్నారు. సదరంలో ఇంకనూ పునఃపరిశీలనకు పంపని 9,263 సర్టిఫికెట్‌లు ఉన్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికి పింఛను కొనసాగుతుందని అన్నారు.

‘దుర్గం’లో దొంగ నోట్ల హల్‌చల్‌

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణంలో దొంగనోట్ల చెలామణి వెలుగు చూసింది. బ్రహ్మయ్య గుడి వద్ద ఉన్న ఓ టీ కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం కళ్లజోడు ధరించిన వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ రూ.200 నోటును నిర్వాహకురాలు యశోదమ్మ ఇచ్చాడు. రెండు సిగరెట్లు తీసుకోని చిల్లర రూ.160 తీసుకుని వెళ్లిపోయాడు. అయితే అది దొంగ నోటుగా ఆలస్యంగా గుర్తించిన నిర్వాహకురాలి సమాచారంతో విషయాన్ని కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: స్థానిక తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్‌గా జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ శుక్రవారం కలకలం రేపింది. ఈ సంతకం కొంతకాలం క్రితం బదిలీపై వచ్చిన తహసీల్దార్‌ది కావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తాడిపత్రికి చెందిన ఓ యువతి గ్రూప్‌ –2 పరీక్షలకు సిద్ధమవుతూ అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌తో లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. ఈ అంశంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్‌గా సర్టిఫికెట్‌ జారీ చేశారు. వెరిఫికేషన్‌లో భాగంగా సర్టిఫికెట్‌ను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పంపింది. తన సంతకంతో కూడిన మాన్యువల్‌ సర్టిఫికెట్‌ చూడగానే తహసీల్దార్‌ సోమశేఖర్‌ నివ్వెరపోయారు. సంతకం చేసిన అధికారి గురించి అరా తీసి మందలించే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. విసయాన్ని కలెక్టర్‌ దృష్టికి తహసీల్దార్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశించినల్లు తెలిసింది. దీంతో డిఫెన్స్‌లో పడిన సదరు అధికారి అధికార పార్టీ నేతల వద్దకు చేరుకుని పైరవీలకు తెరలేపినట్లు సమాచారం.

అక్రిడిటేషన్ల

గడువు పొడిగింపు

అనంతపురం అర్బన్‌: జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఉత్తర్వులు మేరకు కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత గడువు ఈ నెల 30తో ముగియనుంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30వ తేదీ వరకు, లేదా కొత్త కార్డులు జారీ చేయడంలో ఏదీ ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉంటుంది.

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌ 1
1/3

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌ 2
2/3

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌ 3
3/3

అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ : కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement