
ఎరువుల విక్రయాల నిలుపుదల
తాడిపత్రి రూరల్/అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తాడిపత్రిలో నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించి మాకం ఎరువుల దుకాణంలో రూ.74 వేలు, భవాని ఫర్టిలైజర్స్‌లో రూ.3.98.600, శ్రీలక్ష్మీవేంటేశ్వర ఫర్టిలైజర్స్‌లో రూ.1,98,650 విలువ చేసే ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. తనిఖీల్లో వ్యవసాయాధికారులు వాసుప్రకాష్, డీసీటీఓ రమేష్, విజిలెన్స్ ఎస్‌ఐ నరేంద్రభూపతి పాల్గొన్నారు.
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం : డీఆర్‌ఎం
గుంతకల్లు: నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులకు క్రీడల ద్వారా మానసిక ప్రశాంత లభిస్తుందని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక రైల్వే గ్రౌండ్‌లో రైల్వే ఉద్యోగులకు నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రైల్వే ఉద్యోగులు ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి అనేక క్రీడా సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. అందులో భాగంగా రైల్వే గ్రౌండ్‌ను ఆధునీకరించడంతోపాటు జిమ్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల విక్రయాల నిలుపుదల