
డీఎస్సీలో మెరిసిన కూలీ బిడ్డ
ఉరవకొండ: డీఎస్సీ మెరిట్ జాబితాలో కూలీ దంపతుల కుమార్తె జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు కై వసం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు ఎర్రిస్వామి, లింగమ్మ దంపతుల కుమార్తె మౌనిక డీఎస్సీలో 84 మార్కులు సాధించి జోనల్ స్థాయిలో 6వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా ఎంపికై ంది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆమిద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన మౌనిక ఖోఖోలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించారు. డీఎస్సీలో ర్యాంకు సాధించిన మౌనికను గ్రామస్తులు అభినందించారు.