
అధికారులతో వాగ్వాదం
గుత్తి: అన్యాయంగా పెన్షన్లు రద్దు చేశారంటూ లబ్ధిదారులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 137 పెన్షన్లు రద్దయ్యాయి. మరో 17 పెన్షన్లు కన్వర్ట్ చేశారు. సాంకేతికంగా మొత్తం 154 పెన్షన్లు తొలగించారు. ఈ మేరకు నోటీసులు రావడంతో పలువురు లబ్ధిదారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎందుకు తమ పెనన్లు రద్దు చేశారని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే తాము పాటిస్తామని అధికారులు చెప్పారు. తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనతో వెనుదిరిగారు.