కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌ | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌

Aug 9 2025 5:06 AM | Updated on Aug 9 2025 5:06 AM

కరెంట

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌

● అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన విశ్వనాథ్‌ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం కార్యాలయానికి వెళ్లాడు. డబుల్‌ బెడ్‌రూం ఇంటి కోసం 5 కిలోవాట్ల విద్యుత్‌ సామర్థ్యం అవసరం ఉంటుంది. ఇందు కోసం 5 కిలో వాట్లకు రూ.10,550 ఖర్చు అవుతుంది. అయితే జీఎస్టీలు, ఇతర చార్జీల కింద రూ.2,409 చెల్లిస్తేనే మీటర్‌ మంజూరు అవుతుందని విద్యుత్‌ అధికారులు తెలపడంతో షాక్‌కు గురయ్యాడు. రెండు రోజుల క్రితం నుంచే ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలపడంతో చేసేది లేక రూ.13వేలు చెల్లించి విద్యుత్‌ మీటర్‌ బుక్‌ చేసుకున్నాడు.

అనంతపురం టౌన్‌: అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని.. అవసరమైతే ఉన్న చార్జీలను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత మాట తప్పారు. వివిధ రూపాల్లో ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. గతంలో రూ.50 అప్లికేషన్‌ ఫీజుతోనే మీటర్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉండేది. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి కిలో వాట్‌కు ఇంత అని చెల్లించి మీటర్‌ తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో కిలోవాట్‌ రుసుంతో పాటు స్టేట్‌ జీఎస్టీరూ.184, సెంట్రల్‌ జీఎస్టీ రూ.184, ఇతర చార్జీల కింద రూ.2041 చొప్పున విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపుతున్నారు.

‘కార్పొరేట్ల’కు దోచిపెట్టేందుకే..

విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే నష్టాల పేరిట విద్యుత్‌ చార్జీలను పెంచేసి సామాన్యులపై భారం మోపుతున్నాయి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తిరిగి స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. దీనికి తోడు ‘ఇతర చార్జీల’ పేరిట రూ.2వేలకు పైబడి అదనంగా భారం మోపుతున్నారు. పెంచిన మొత్తాన్ని రద్దు చేయాల్సిందే. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తాం.

– వి.రాంభూపాల్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు

మాకే అవగాహన లేదు

కొత్తగా కరెంటు మీటర్‌ దరఖాస్తు సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌, వినియోగదారులు వాడే విద్యుత్‌ కిలోవాట్‌ సామర్థ్యాన్ని బట్టి డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేసేవాళ్లం. ప్రస్తుతం మీటర్‌ బుకింగ్‌ సమయంలోనే వస్తున్న అదర్‌ చార్జెస్‌ (ఇతర చార్జీలు) వివరాలపై మాకే అవగాహన లేదు. కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపి వాటి వివరాలు కనుక్కుంటాం.

– శేషాద్రి శేఖర్‌, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ

ఇతర చార్జీల పేరిట

రూ.2వేలకు పైగా వడ్డన

కూటమి పాలనలో

సామాన్యులపై మరో భారం

మాట తప్పి ఇష్టారాజ్యంగా

బాదుడేంటున్న జనం

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌ 1
1/3

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌ 2
2/3

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌ 3
3/3

కరెంట్‌ కనెక్షన్‌కు భారీ చార్జ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement