8 మంది తహసీల్దార్లకు స్థానచలనం | - | Sakshi
Sakshi News home page

8 మంది తహసీల్దార్లకు స్థానచలనం

Jun 5 2025 1:32 PM | Updated on Jun 5 2025 1:32 PM

8 మంది తహసీల్దార్లకు స్థానచలనం

8 మంది తహసీల్దార్లకు స్థానచలనం

అనంతపురం అర్బన్‌: జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కోసం 16 మంది తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతగా 8 మందిని బదిలీ చేశారు.

ఖాళీ స్థానాలను భర్తీ చేయని వైనం..

జిల్లాలో కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, కణేకల్లు, యల్లనూరు తహసీల్దార్లతో పాటు అనంతపురం ఆర్‌డీఓ కార్యాలయం డీఏఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డీ.హీరేహాళ్‌ తహసీల్దారును బెళుగుప్పకు బదిలీ చేశారు. శెట్టూరు తహసీల్దారు ఈ నెల 2న ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో కళ్యాణదుర్గం ఆర్‌డీఓ కార్యాలయ డీఏఓని నియమించారు. ఇన్‌చార్జ్‌ పాలనలో ఉన్న ఆరు మండలాలకు తహసీల్దార్లను, అనంతపురం ఆర్డీఓ కార్యాలయ డీఏఓని తొలివిడతలో నియమించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement