ట్యాంకర్లతో తాగునీటి సరఫరా
కళ్యాణదుర్గం: కంబదూరు మండలం అండేపల్లిలో బుధవారం ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేపట్టారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై రెండు రోజుల క్రితం స్థానికులు రోడ్డెక్కారు. కంబదూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. దీనిపై ‘సాక్షి’లో ‘తారస్థాయికి దాహం కేకలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో స్పందించిన కంబదూరు మేజర్ పంచాయతీ సర్పంచు పద్మావతమ్మ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆమె కుమారుడు, వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ సాకే గంగాధర్ తన సొంత నిధులతో అండేపల్లిలో నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్యాంకర్లతో తాగునీటి సరఫరా


