ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి
అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పాత ఆర్‌డీఓ కార్యాలయ ఆవరణలోని గోడౌన్లలో ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగాలన్నారు. పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చూడాలన్నారు. ఆర్‌డీఓ కేశవనాయుడు, ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
గునపం పోగొట్టారని గొడవ
● ఇద్దరికి తీవ్రగాయాలు
ఉరవకొండ: రేణుమాకుపల్లిలో గునపం కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు గొర్రెల కాపరులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి, వన్నూర్‌స్వామి, గోవిందమ్మకు మరో వర్గానికి చెందిన గొర్రెల కాపరులు కుమార్‌స్వామి, గోపిల మధ్య గునపం పోగట్టారంటూ ఘర్షణ ప్రారంభమైంది. ఘర్షణలో గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూర్‌స్వామి కలగజేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరి మీద ఒకరు కట్టెలతో దాడి చేసుకున్నాయి. ఇందులో పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి తల, చేతులకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో వీరిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
కణేకల్లులో భారీ చోరీ
● 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ
కణేకల్లు: పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు, స్థానికుల కథనం మేరకు స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో తబుష్షుమ్, తన కూతురు, కొడుకుతో కలిసి నివసిస్తోంది. తబుష్షుమ్ చిన్నాన్న మృతి చెందడంతో భర్త, పిల్లలతో కలిసి సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు శుక్రవారం రాత్రి ఇంటి వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడిన దుండగులు 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చిన తబుష్షుమ్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహళ్ ఎస్‌ఐ నబీరసూల్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడి చోరీ చేయడంతో ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వారే చోరి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సౌత్ జోన్ పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ విద్యార్థినులు
అనంతపురం ఎడ్యుకేషన్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ (ఉమెన్) పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈసీఈ బ్రాంచ్ 4వ సంవత్సరం విద్యార్థిని బి.భారతి, మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.నిషిత సౌత్ జోన్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 2026 జనవరి 2 వరకు బెంగళూరు క్రిష్ట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి టోర్నీ నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రామచంద్ర, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ కె.శివానంద, ఇతర అధ్యాపకులు అభినందించారు.
ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి
ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి
ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి


