ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

May 5 2025 8:58 AM | Updated on May 5 2025 9:00 AM

అనంతపురం అర్బన్‌: ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్‌ఏ) కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. స్థానిక ట్రెజరీ హోమ్‌లో నిర్వహించిన ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారులుగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు పి.కిరణ్‌కుమార్‌ (నెల్లూరు), డి.రవికుమార్‌(కర్నూలు), ఎన్నికల పరిశీలకులుగా ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్‌, ఉపాధ్యక్షుడు ఎ.రవికుమార్‌ వ్యవహరించారు. కార్యవర్గంలోని అన్ని స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రటించారు. ఎన్నికై న సభ్యులకు ప్రోసీడింగ్స్‌ అందజేశారు.

నూతన కార్యవర్గ సభ్యులు వీరే..

ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.శంకరనారాయణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా కె.ఫారూక్‌ మహమ్మద్‌, కార్యదర్శిగా జి.మహేశ్వరెడ్డి, కోశాధికారిగా బి.అనంతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పి.సుమనలత, జి.జగదీష్‌, ఎం.శ్రీనివాసరావు, కె.వాసుమూర్తియాదవ్‌, సంయుక్త కార్యదర్శులుగా పి.సిద్ధిక్‌ఖానుమ్‌, డి.శ్రీనివాసులు, ఎం.కె.రాజేష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా సి.తిరుమలరెడ్డి, సి.కిషోర్‌కుమార్‌చౌదరి, జి.ఉమేష్‌ ఎన్నికయ్యారు.

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి

రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు శంకరయ్య

అనంతపురం టవర్‌క్లాక్‌: ఉమ్మడి జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెంది, పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల నుంచి ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు శంకరయ్య తెలిపారు. అనంతపురంలోని శ్రీనివాస కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపకలను అందజేసి సత్యరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను నేరుగా, లేదా పోస్టు ద్వారానైనా అనంతపురంలోని శ్రీనివాస కల్యాణమంటపంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98664 19693, 94901 80177, 92477 92567లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు పామురాయి వెంకటేశ్వర్లు, వెంకట్రాముడు, విజయభాస్కర్‌, సాయిప్రసాద్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

11న కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

అనంతపురం టవర్‌క్లాక్‌: పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన కురుబ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ నెల 11న ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందించనున్నారు. ఈ మేరకు కనకదాస విద్య, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్రిస్వామి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 11న అనంతపురంలోని కనకదాస కల్యాణ మంటపంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి హాజరవుతారని పేర్కొన్నారు.

ఖజానా ఉద్యోగుల సంఘం  నూతన కార్యవర్గం ఎన్నిక 1
1/1

ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement