మాతృమూర్తిని మించిన దైవం లేదు
● గణపతి సచ్చిదానంద స్వామీజీ
రాప్తాడు: సృష్టిలో తల్లిని మించిన దైవం లేదని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మాతృమూర్తి జయలక్ష్మి మాత జయంతి ఉత్సవాలను రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో స్వామీజీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు. ముందుగా ఆశ్రమంలోని జయలక్ష్మి మాతా ఆలయంలో విశేష హోమాలు, కుంకుమార్చనలు, వడిబియ్యం సమర్పణ,దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ.. మాతృమూర్తి ప్రాముఖ్యతను వివరించారు.ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు.


