అనంతపురం: నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న బీవీఆర్‌కే ఫంక్షన్ హాలు వేదికగా రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌ఫో గురువారం ప్రారంభమైంది. తొలి రోజే విశేష స్పందన లభించింది. ఎడ్యుకేషన్ ఎక్స్‌ఫోలో అనేక విద్యా సంస్థలు ప్రాతినిథ్యం వహించాయి. బెంగళూరుకి చెందిన హిందూస్తాన్ ఏవియేషన్ అకాడమీ (మారతహళ్లి), సంభ్రమ్ ఇనిస్టిట్యూట్ (జాలహళ్లి ఈస్ట్), ఎస్‌ఈఏ(సీ) ఇంజినీరింగ్ కళాశాల (కృష్ణరాజపురం)ల్లో అందించే కోర్సులు, ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా అందించే కోర్సులు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన వినూత్న కోర్సులపై విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. ప్రత్యేక స్టాళ్లను విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించి .. కళాశాలల గురించి వివరాలు సేకరించారు. బెంగళూరులో చదవాలనుకునే విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశమని పేర్కొన్నారు. కాగా, శుక్రవారంతో ఈ ఎక్స్‌ఫో ముగియనుంది.
ఆకట్టుకున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌ఫో
ఆకట్టుకున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌ఫో


