కళ్యాణదుర్గం రూరల్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని భట్టువానిపల్లి, పాలవాయి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. భట్టువాని పల్లిలో సహజసిద్ధ వ్యవసాయం (న్యాచురల్ ఫార్మింగ్) చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు. సహజంగా పండించిన పంటలకు ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని వ్యవసాయ అధికారులను రైతులు కోరారు. రబీలో రైతులు పండించిన పంటలు వేరుశనగ, మొక్కజొన్న పంటలకు దళారుల బెడద తప్పించి ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు


