సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఓ వైపు ప్రైవేటు మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు రోజురోజుకూ వినియోగదారుల సంఖ్యను భారీగా పెంచుకుంటుండగా బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం వచ్చిన కస్టమర్లకు సేవలందించలేక చతికిలపడుతోంది. తమకు బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసులు కావాలని వచ్చిన వారికి 4జీ సర్వీసులు ఇవ్వకలేకపోవడంతో లక్షలాదిమంది వినియోగదారులు బిత్తరచూపులు చూస్తున్నారు. కొద్ది నెలల క్రితం జియో, ఎయిర్‌టెల్ ప్రొవైడర్లు రీచార్జ్ రేట్లు పెంచడంతో చాలామంది వినియోగదారులు ఒక్కసారిగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు నెట్‌వర్క్ లేదు. ఎరక్కపోయి ఇరుక్కున్నామన్న భావనతో కస్టమర్లు తీవ్రంగా మండి పడుతున్నారు.
కొత్తగా 1.85 లక్షల మంది కస్టమర్లు
రీచార్జ్ రేట్లు పెరిగాక చాలామంది సగటు కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపారు. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 1.05 లక్షల మంది, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో 80 వేల మందికి పై చిలుకు వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. మూడు నెలల క్రితం మారినా ఇప్పటికీ వారికి నెట్‌వర్క్ సరిగా రావడం లేదు. ఓ మోస్తరు టౌన్‌లో ఉన్నా సిగ్నల్స్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లెల్లో అయితే వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మొబైల్‌లో మాత్రం 4జీ సర్వీసు చూపిస్తుంది, కానీ సిగ్నల్స్ రావు. దీంతో బీఎస్‌ఎస్‌ఎల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. . మరోవైపు ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లు 5జీ దాటుకుని 6జీ ఏర్పాట్లలో తలమునకలై ఉండటం విశేషం.
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కష్టాలు ఇలా..
● కస్టమర్లకు ఫోన్‌పే పనిచేయడం లేదు.
● గూగుల్‌పే, ఎస్‌బీఐ యోనో వంటివి కూడా పనిచేయడం లేదు.
● ఆధార్ అప్‌డేట్ కోసం వెళితే ఓటీపీలు సైతం రావడం లేదు.
● వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● కొన్నిచోట్ల టవర్ దగ్గర ఉన్న వాళ్లకు కూడా సిగ్నల్స్ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
● ఇంటర్నెట్ డేటా అటుంచితే సాధారణ కాల్స్ కూడా పోవడం లేదని వాపోతున్నారు.
● రకరకాల సర్వీసుల్లో ఓటీపీలూ రావడం లేదని కస్టమర్ల ఆవేదన.
సాంకేతిక సమస్యలున్నాయి
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీసుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. అందుకే సర్వీసు సరిగా లేదు. దీనిపై మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సమస్యలు త్వరలోనే సమసిపోతాయని భావిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను అధిగమించి నాణ్యమైన సేవలందిస్తాం.
–ముజీబ్ పాషా, బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్, అనంతపురం జోన్
అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సమస్య
ఎక్కడా 4జీ సేవలు అందడం లేదని అధికారులకు ఫిర్యాదులు
ఓ మోస్తరు టౌన్‌లోనూ బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్స్ లేవంటూ గగ్గోలు
ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి అసలే పనిచేయని పరిస్థితి
● ఉరవకొండలోని దుస్తులషాపులో పనిచేసే సత్యనారాయణ మొబైల్