
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా నామినేషన్, ఐటీ, కౌంటింగ్ బృందాలను నియమిస్తున్నాం. కొత్తగా వచ్చిన రిటర్నింగ్ అధికారులకు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించాం. కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీరు, ర్యాంప్ తదితర వసతులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. వారి నుంచి అందే ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపుతున్నారు.
– గౌతమి, కలెక్టర్