చిలమత్తూరు: మండలంలోని కొడికొండ –కందుర్పర్తి మార్గంలోని పొలాల్లో కల్లుకుంటకు చెందిన వెంకటేష్ (40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి బంధువులు సాధారణ మరణం అని చెప్పారని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారని ఎస్‌ఐ గంగాధర్ తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
సెల్ఫీ వీడియో తీసి
ఆత్మహత్యాయత్నం
ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాలతో మున్సిపల్ అటెండర్ కృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే కృష్ణ సోమవారం తన కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం స్నేహితులకు పంపి వాజ్‌మోల్ తాగాడు. గమనించిన మున్సిపల్ సిబ్బంది అతనిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.