పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
● రూ. 3 లక్షల నగదు,
25 ద్విచక్రవాహనాలు స్వాధీనం
లేపాక్షి: మండలంలోని శిరివరం గ్రామ సమీపంలోని ఓబుళాపురం చెరువు వద్ద పేకాట ఆడుతున్న 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3 లక్షలు నగదు, 20 సెల్‌ఫోన్లు, 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కంజాక్షన్, రూరల్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోపి, సిబ్బంది గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చెరువు వద్ద భారీగా వాహనాలు కనిపించడంతో అక్కడకు వెళ్లి పరిశీలిస్తే భారీ మొత్తాన్ని వెచ్చిస్తూ పేకాట ఆడుతున్న 21 మంది పట్టుబడ్డారు. పోలీసుల రాకను గమనించిన ఏడుగురు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


