
సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రాజకీయంగా పెద్దపీట వేశారు. కుల గణన జరగాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయా వర్గాలు ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. గత టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో బాంబులు వేసి.. తుపాకులతో కాల్చి రక్తపుటేర్లు పారాయి. నేడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చెరువులను నీళ్లతో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. రాప్తాడులో రౌడీల పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు.
– గోరంట్ల మాధవ్,
హిందూపురం ఎంపీ
బడుగులకు సముచిత స్థానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పదవులు అందించి వారికి సముచిత స్థానం కల్పించారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేసిన సీఎంగా జగన్ ఖ్యాతి గడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వడంతో పాటు రెండు ఎంపీ పదవులను బీసీలకు ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు జనరల్ స్థానాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు.
– మాలగుండ్ల శంకరనారాయణ,
ఎమ్మెల్యే, పెనుకొండ
మహిళలకు పెద్దపీట వేసిన జగనన్న
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు అనేక రాజకీయ పదవులు కట్టబెట్టి పెద్దపీట వేశారు. వెనుకబడిన వాల్మీకి కులానికి చెందిన సామాన్య మహిళ అయిన నాకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కిందంటే జగనన్న చలువే. రాప్తాడు నియోజకవర్గంలో ఆరు మండలాలకు ఎంపీపీలుగా, రెండు మండలాలకు జెడ్పీటీసీ సభ్యులుగా మహిళలకు అవకాశం కల్పించారు.
– బోయ గిరిజమ్మ, జెడ్పీ చైర్ పర్సన్
అక్కున చేర్చుకుంది జగనే
నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ.. అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకున్నది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అణగారిన వర్గాలకు అండగా నిలవలేదు. ఎంతోమంది వెనుకబడిన కులాల వారికి రాజ్యాధికారం కల్పించి వారి గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలాంటి వారే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– పైలా నరసింహయ్య, వైఎస్సార్‌సీపీ
అనంతపురం జిల్లా అధ్యక్షుడు


