
నివాళులర్పిస్తున్న సీఆర్‌పీఎఫ్ అధికారులు
● కలెక్టర్ గౌతమి పిలుపు
అనంతపురం అర్బన్: దేశ రక్షణలో భాగంగా అసువులు బాసిన జవానులు, ఉద్యోగ విరమణ చేసిన సైనికుల కుటంబాల సంక్షేమానికి విరాళాలు అందజేసి సహకరించాలంటూ ప్రజలకు కలెక్టర్ గౌతమి పిలుపునిచ్చారు. త్రివిధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రూ.70 వేలు విలువ చేసే సాయుధ బలగాల పతాక స్టిక్కర్లను, కార్ గ్లాగ్స్‌ను ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి జె.శ్రీనివాసులు, ఎస్‌ఏ గిరిష్, జేఏ బాబాఫకృద్ధీన్, ఓఎస్ అనిల్ పాల్గొన్నారు.
గుండెపోటుతో జవాన్ మృతి
ఉరవకొండ: స్థానిక లక్ష్మీనరసింహ కాలనీలో నివాసముంటున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ విజయ్‌కుమార్ (39) గుండెపోటుతో సోమవారం ఉదయం తన ఇంట్లోనే మృతి చెందారు. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా 10 రోజుల క్రితం సెలవుపై ఇంటికి చేరుకున్నారు. ఉదయం ఛాతీలో నొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు ఉరవకొండకు చేరుకుని జవాన్ మృతదేహానికి సైనిక వందనం సమర్పించారు.

Comments
Please login to add a commentAdd a comment