
అనంతపురం కార్పొరేషన్: మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం లోని తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావుపూలే చేసిన కృషిని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తూ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేశారన్నారు. కార్పొరేట్ స్థాయి సౌలభ్యాలను పేదలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రాజకీయంగానూ బడుగులకు సముచిత స్థానం కల్పించారన్నారు. మహిళలకు రిజర్వేషన్‌ను కల్పించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్, పదవులు కట్టబెట్టారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ.. కులవివక్షను వ్యతిరేకించిన వారిలో మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్యులన్నారు. అందరికీ సమాన అవకాశాలు రావాలని పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం దక్కిందన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కరరెడ్డి, వాసంతి సాహిత్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ ఎం.మంజుల, డీసీసీబీ చైర్‌పర్సన్ ఎం.లిఖిత, బీసీ కమిషన్ సభ్యుడు కిష్టప్ప, వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు కాగజ్‌ఘర్ రిజ్వాన్, జోనల్ ఇన్‌చార్జ్‌లు రిలాక్స్ నాగరాజు, రాజారాం, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, శ్రీదేవి, సైఫుల్లాబేగ్, కృష్ణవేణి, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, పామిడి వీరాంజనేయులు, వేముల నదీం, అనిల్‌కుమార్‌గౌడ్, రామచంద్రారెడ్డి, భారతి, రాధాయాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి