అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఉచితంగా ట్యాలీలో శిక్షణ అందించనున్నట్లు ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్స్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. 10వ తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలన్నారు. 35 రోజుల పాటు వసతి, భోజనంతో కూడిన శిక్షణ ఇస్తామన్నారు. ట్యాలీ, జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్, లైఫ్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ ఎథిక్స్‌లో అత్యుత్తమ శిక్షణ అందిస్తామన్నారు. కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 90004 87423 నంబరుకు సంప్రదించాలన్నారు.