
సూచనలిస్తున్న డాక్టర్ కామేశ్వరప్రసాద్
అనంతపురం సిటీ: ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకూ శ్రీకాళహస్తిలో జరిగే ఆపదమిత్రల రాష్ట్ర స్థాయి శిక్షణకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఎంపికయ్యారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ భాస్కరరెడ్డి గురువారం వెల్లడించారు. ఎంపికై న వారిలో పుట్లూరుకు చెందిన భీకన్నగారి శిరీష, రామతులసి, నాగ చౌడేశ్వర బాబు, గుడిబండకు చెందిన ప్రదీప్, పీసీ నరేష్, రొళ్లకు చెందిన నాగేంద్ర, అనిల్‌కుమార్, మంజునాథ ఉన్నారు.
హెచ్‌ఐవీ రోగులకు
మందులు అందజేయండి
● ఏపీ సాక్స్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ కామేశ్వరప్రసాద్
అనంతపురం సప్తగిరి సర్కిల్: హెచ్‌ఐవీ రోగులు క్రమం తప్పకుండా మందులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(సాక్స్) అదనపు డైరెక్టర్ డాక్టర్ కామేశ్వరప్రసాద్ సూచించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఐసీటీసీ, ఏఆర్‌టీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని వైరల్ లోడ్ కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ప్రతి నెలా హెచ్‌ఐవీ రోగులు మందులు సక్రమంగా తీసుకోవడం లేదని గుర్తించి, కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మందులను చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సత్యనారాయణ, షేర్ ఇండియా డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిల్లా కో– ఆర్డినేటర్ రమణ, సురేష్, కమలాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.