జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

అనకాపల్లి: రాజీమార్గమే రాజమార్గమని, జాతీయ లోక్‌ అదాలత్‌ అంతిమ తీర్పని డిసెంబర్‌ 12న జరిగే లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నపాటి సమస్యలను పెద్దగా చేసుకుని కోర్టులు చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి సమయాన్ని వృఽథా చేసుకోవద్దన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో జరిగే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్‌ స్టేషన్లు, న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండి, రాజీపడదగ్గ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో, శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి లోక్‌ అదాలత్‌ గొప్ప అవకాశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement