విద్యుత్‌ బిల్లుల పేరుతో నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల పేరుతో నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

మహారాణిపేట: విద్యుత్‌ బకాయిల పేరుతో సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్‌ఎంఎస్‌ లు, వాట్సాప్‌ సందేశాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్‌ విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ బి. సింహాచలం నాయుడు సూచించారు. బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ వచ్చే సందేశాల్లోని లింకులను క్లిక్‌ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. విద్యుత్‌ బిల్లులకు సంబంధించిన వివరాలను అధికారిక మార్గాల ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు. సందేహాలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా వాట్సాప్‌ నంబర్‌ 9493681912ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement