కొలువుదీరిన అసమ్మతి | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన అసమ్మతి

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

రెండోరోజు ప్రత్యేక సమావేశానికిహాజరైన జనసేన కౌన్సిలర్లు

ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు

వైస్‌చైర్మన్‌గా టీడీపీకి చెందిన గొర్లి నానాజీ ఎన్నిక

8లో

యలమంచిలి రూరల్‌: యలమంచిలి మున్సిపల్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సాక్షిగా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య అసమ్మతి,విభేధాలు బహిర్గతమయ్యాయి. పదవుల పంపకంలో జనసేన,బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య ఏర్పడిన అసమ్మతి మంగళవారం యలమంచిలి పురపాలకసంఘ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో బయటపడింది. కూటమి ధర్మం పేరుతో బలం ఉన్నా పురపాలకసంఘంలో తమకు ఎలాంటి పదవుల్లో ప్రాధాన్యం లేకపోవడంపై జనసేన నేతలు రగిలిపోతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవి బీజేపీకి కేటాయించగా పిళ్లా రమాకుమారి గెలుపొందారు.వైస్‌ఛైర్మన్‌ పదవిని టీడీపీకి కేటాయించారు.ఇదే కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపింది.ఈ కారణంగా సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి జనసేన వార్డు కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో వెస్‌ఛైర్మన్‌ ఎన్నిక వాయిదాపడింది.మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యుని హోదా కలిగిన నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ కూడా సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. మంగళవారం యలమంచిలి మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, 11 మంది జనసేన వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించిన అడ్డరోడ్డు ఆర్డీవో కె.వి. రామలక్ష్మి జనసేన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం వైస్‌ఛైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహించగా టీడీపీకి చెందిన గొర్లి శివన్నారాయణ మూర్తి(నానాజీ)ని టీడీపీ,జనసేన,బీజేపీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయనకు పీవో రామలక్ష్మి ఈ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.పలువురు సభ్యులు వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికై న నానాజీకి అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌..ఎడముఖం..పెడముఖం

మంగళవారం జరిగిన వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందు వరుసలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి పక్కపక్కనే కూర్చున్నా వారిద్దరూ ఎడమొహం,పెడమొహంగానే ఉన్నారు. కనీసం ఒకరినొకరు పకలకరించుకోలేదు. వైస్‌చైర్మన్‌ ఎన్నిక సమయంలో బీజేపీకి చెందిన చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి వర్గీయులకు కాపు సామాజికవర్గం గుర్తొచ్చిందని, అగ్రకులాల సామాజిక వర్గాలపై అంత ప్రేమ ఉంటే యలమంచిలి మున్సిపల్‌ ౖచైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించినపుడు ఆ పదవినే జనరల్‌ కేటగిరీ మహిళకు ఇస్తే బాగుండేదని, అపుడు ప్రజలు రమాకుమారి మాటలు నమ్మేవారని కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె మూడోసారి పోటీ చేశారని ఇది పదవీ కాంక్ష కాదా అని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయాల వల్ల యలమంచిలి అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రానున్న రెండేళ్లలో యలమంచిలి పట్టణంలో రాజకీయాలకు పట్టిన కుళ్లు వదలగొడతానని పరోక్షంగా రమాకుమారి వర్గీయులనుద్దేశించి అనడం చర్చనీయాంశంగా మారింది.

వస్‌చైర్మన్‌ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement