సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ నూతన కార్పొరేటర్లను సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని కార్పొరేటర్లను అభినందించారు. కార్పొరేటర్లు పోతిన హనుమంతురావు, పోతిన జాహ్నవి, మొల్లి లక్ష్మి, కోడిగుడ్ల పూర్ణిమ, అల్లు వెంకట సత్యశ్రీ, షేక్ జాహిరున్నీసా, సోమాదుల సురేష్‌కుమార్, గుడివాడ వెంకట సాయి అనూష, గొండేసి శ్రీదేవి, ధర్మాల రాధిక, కోమటి శ్రీనివాసరావు, మద్ది శ్రీనివాసరావు, దాసరి అన్నపూర్ణలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల శ్రీనివాస్, దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, బొత్స అనూష, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమణికుమారి, జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, సతీష్‌వర్మ, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు.


