3 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

3 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

Nov 24 2026 12:48 AM | Updated on Nov 24 2026 12:48 AM

కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో డిసెంబర్‌ 3వ తేదీ నుంచి శ్రీవారి 4వ వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 5గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, 4వ తేదీన యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ట, 5న పవిత్ర జప్యము, పవిత్ర సమర్పణ, తిరువీధి ఉత్సవం ఉంటాయన్నారు. 6వ తేదీన స్నపన తిరుమంజనం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభారోపణ అనంతరం అర్చక బహుమానం, యజమాన ఆశీర్వచనములు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement