ప్రకృతి ఒడిలో పర్యాటకుల సందడి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో పర్యాటకుల సందడి

Nov 23 2026 5:48 AM | Updated on Nov 23 2026 5:48 AM

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం డుడుమ జలపాతం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. జలపాతం పరిసర ప్రాంతాలన్నీ సందర్శకుల సందడితో కళకళలాడాయి. సరిహద్దు ప్రాంత ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. డుడుమ జలపాతంతో పాటు జోలాపుట్టు జలాశయం, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం, దేశిమా మ్యూజియం, ఉంచాయిపడ జలపాతం తదితర ప్రాంతాలను సందర్శించి ఆనందంగా గడిపారు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిహద్దు ప్రాంత రహదారులన్నీ పర్యాటకుల రాకపోకలతో సందడిగా కనిపించాయి.

డుడుమ అందాలను తిలకించిన సందర్శకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement