రేపు హేమగిరి తిరిగొద్దాం రండి.. | - | Sakshi
Sakshi News home page

రేపు హేమగిరి తిరిగొద్దాం రండి..

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

అనకాపల్లి టౌన్‌: సత్యనారాయణపురం హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ నెల 24న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ చైర్మన్‌ అప్పికొండ గణేష్‌ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నామన్నారు. గిరి ప్రదక్షిణ డీఎస్పీ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ఆర్చి వద్ద ప్రారంభమై, ఏఎంఏఎల్‌ కళాశాల పక్క నుంచి సాగుతూ సత్యనారాయణస్వామి కొండ కింద ఆలయం పక్క నుంచి కొండ మీదకు చేరుకుంటుందన్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఉత్సవమూర్తుల రథయాత్ర సాగుతుందన్నారు. ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మంచినీరు తదితర సౌకర్యాలకు కల్పించినట్టు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మణిమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement