జనగణన విధుల్లో తప్పిదాలకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

జనగణన విధుల్లో తప్పిదాలకు తావివ్వొద్దు

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

తుమ్మపాల: జనగణన ప్రక్రియ అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అధికారులు అత్యంత కచ్చితత్వంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా రెవెన్యూ అఽధికారి వై.సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా, ఛార్జ్‌ స్థాయి అధికారులకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగణన విధుల ప్రాధాన్యాన్ని అధికారులకు వివరించారు. జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ దయాసాగర్‌, మాస్టర్‌ ట్రైనర్‌ డాక్టర్‌ జగన్నాథ పూరి శిక్షకులుగా వ్యవహరించి జనగణన విధి విధానాలు, సమాచార సేకరణ పద్ధతులు, డిజిటల్‌ యాప్‌ వినియోగం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్వోలు, ఇతర ఛార్జ్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement