వడ్డాదిలో ఇల్లు దగ్ధం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం | - | Sakshi
Sakshi News home page

వడ్డాదిలో ఇల్లు దగ్ధం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

బుచ్చెయ్యపేట: వడ్డాది సగరాల వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా సుమారు రెండు లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన చల్లా సత్యనారాయణ కుటుంబం ఊరూరా తిరిగి తల వెంట్రుకలు సేకరిస్తూ జీవిస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. బట్టలు, తిండిగింజలు, వంట సామాగ్రి, ఇతర సామాన్లు అన్నీ కాలి బూడిదవ్వడంతో సర్వసం కొల్పోయి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబం వాపోయింది. సంఘటన వార్త తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, సర్పంచ్‌ పోటీ అభ్యర్ధి దాడి గోవింద,మాజీ వైస్‌ ఎంపీపీ దొండా నారాయణమూర్తి తదితరులు బాధితుని పరామర్శించి రూ, 10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు రూ, 10 వేలు, ఎంపీటీసీ దొండా గిరిబాబు రూ,10 వేలు ఆర్థిక సహాయం అందించారు. తహసీల్దార్‌ లక్ష్మి, వీఆర్వో సుధాకర్‌లు బాధిత కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందించి పరిహారం అందేలా చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement