రాంబిల్లిలో టీడీపీ శ్రేణుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రాంబిల్లిలో టీడీపీ శ్రేణుల ఆందోళన

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

ఎమ్మెల్యే సుందరపు కూటమి ధర్మం పాటించలేదంటూ నిరసన

రాంబిల్లి: మండల కేంద్రం రాంబిల్లిలో ఆదివారం టీడీపీకి చెందిన జెడ్‌.చింతువ ఎంపీటీసీ సభ్యుడు ఎరిపిల్లి అప్పలరాజు అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎంపీపీ పదవి కోసం అప్పలరాజుకు టీడీపీ బీఫారం ఇచ్చి మోసం చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఫారం కూటమి పొందని లక్ష్మీనాగరత్నం స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీపీగా పోటీ చేశారని ఆమెకు టీడీపీ ఎంపీటీసీలు మద్దతు తెలపడం అన్యాయమని ఇందులో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ ప్రమేయం ఉందని మత్స్యకార సొసైటీ మాజీ అధ్యక్షుడు చెల్లూరి రమణ తదితరులు ఆరోపించారు. ఎమ్మెల్యే తమ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని కూటమి ధర్మం ఎమ్మెల్యే పాటించలేదంటూ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేశారు. కూటమి పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement