డేటా సెంటర్‌ అనుమతులు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్‌ అనుమతులు రద్దు చేయాలి

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

మహారాణిపేట: అభివృద్ధి పేరుతో విశాఖ నగరంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌ అనుమతులను, ప్రైవేటు సంస్థలకు కొండలపై చేసిన కేటాయింపులను తక్షణం రద్దు చేయాలని గ్రీన్‌ విశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గ్రీన్‌ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కే బీచ్‌ బస్టాప్‌ నుంచి భగత్‌సింగ్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు రక్షణగా ఉన్న కొండల కేటాయింపులు, తవ్వకాలను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పచ్చని కొండల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతిని, ప్రజలు రోగాల పాలవుతారని, తాగునీటి కష్టాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌లో ఉపాధిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పి యువతను మోసగిస్తోందన్నారు. లక్షా 88 వేల ఉద్యోగాలొస్తాయన్న ప్రభుత్వ ప్రచారంలో నిజం లేదన్నారు. డేటా సెంటర్‌పై వ్యతిరేకత రావడంతో వాటర్‌ కూలింగ్‌, ఎయిర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ అంటూ రోజుకో మాట చెబుతోందని పేర్కొన్నారు. అనుమతులిచ్చిన డేటా సెంటర్లలో ఎన్ని వాటర్‌ కూలింగ్‌, ఎన్ని ఎయిర్‌ కూలింగ్‌ సెంటర్లో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ఎఫ్‌ ప్రతినిధి అనురాధ, జీవీసీఎఫ్‌ ప్రతినిధి జయశ్రీ హటాంగిడి, గ్రీన్‌ విశాఖ కోశాధికారి జి.కాంతారావు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ రఘు, కె.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement