అచ్యుతాపురం రూరల్: అచ్యుతాపురం సెజ్‌లో బొగ్గు అన్లోడ్ చేసి వెళ్లిన డ్రైవర్ అదృశ్యమైన ఘటనపై ఎస్ఐ వెంకటరావు ఆదివారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి భద్రాద్రి కొత్తగూడేం జిల్లాకు చెందిన భుక్యా ప్రసాద్ సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్లీనర్‌తో కలిసి లారీలో అచ్యుతాపురం సెజ్‌కు వచ్చి బొగ్గు అన్లోడ్ చేశారు. అనంతరం డ్రైనర్, క్లీనర్ కలిసి పూడిమడక బీచ్ ప్రాంతంలో సరదాగా గడిపి, అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మడుతూరు కూడలిలో శర్వాణీ మిక్స్డ్ ప్లాంట్ వద్ద లారీతో బస చేశారు. 21వ తేదీ లారీ యజమాని డ్రైవర్‌కు ఫోన్ చేయగా మద్యం సేవించి లేవకపోవడంతో మరో డ్రైవర్‌ను పంపించారన్నారు. అనంతరం అక్కడి నుండి డ్రైవర్ భుక్యా ఎటో వెళ్లిపోయినట్టు క్లీనర్ తెలిపారన్నారు. విచారణలో భాగంగా డ్రైవర్ భుక్యా ఒక్కోసారి నెల రోజులపైబడి ఎటోవెళ్లి పోతుంటారని, అయితే రెండు నెలలు గడిచినా ఆచూకీ లేకపోవడంతో డ్రైవర్ భుక్యా బావమిరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటరావు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


