అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి | - | Sakshi
Sakshi News home page

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

సత్యదేవుని సాక్షిగా ఒకటయ్యారు

అన్నవరం: విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార వ్యవహారాలకు వారధులుగా వారిద్దరూ సత్యదేవుని సాక్షిగా మనువాడారు. దేవస్థానంలో దక్షిణ కొరియాకు చెందిన జియోన్‌, విశాఖపట్నంకు చెందిన ఎన్‌.కృష్ణ దీపక్‌ శనివారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ఆదివారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వ్రత పురోహితుడు మంధా కారుణ్య ఆంగ్లంలో వ్రత కథ వివరించి, వారితో వ్రతం చేయించారు. అనంతరం వధువు జియోన్‌ మాట్లాడుతూ తనకు హిందూ సంస్కృతి, ఆచారాలు బాగా నచ్చాయని, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దర్శనం, స్వామివారి వ్రతం బాగా జరిగాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement