కారు ప్రమాదంలో ఎంపీడీవోకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంలో ఎంపీడీవోకు గాయాలు

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

అచ్యుతాపురం రూరల్‌ : మడుతూరు కూడలి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి అచ్యుతాపురం విధులకు హాజరయ్యేందుకు ఎంపీడీవో బి.చైతన్య తన భర్తతో కలిసి కారులో వస్తుండగా, మడుతూరు కూడలి వద్ద ఎదురుగా మరో వాహనం రావడంతో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎంపీడీఓ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే కారు ఎయిర్‌ బ్యాగ్స్‌ రెండూ వెంటనే తెరుచుకోవడంతో కారులో ఉన్న ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు అచ్యుతాపురంలోని పవన్‌ సాయి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖట్నం తరలించారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్‌ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement