బుచ్చెయ్యపేట: వడ్డాదిలోని జెడ్పీ హైస్కూల్‌లో దేశ నేతల విగ్రహాలకు అవమానం జరిగింది. 700 మంది విద్యార్థులున్న హైస్కూల్‌కు డీసీసీబీ మాజీ డైరెక్టర్, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు కోవెల జనార్థనరావు తండ్రి కోవెల అప్పనదొర హైస్కూల్‌కు ఉచితంగా ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ పాఠశాలలో పదేళ్ల క్రితం మాజీ రాష్టపతి అబ్దుల్‌కలాం, స్వామి వివేకానంద, స్థలధాత కోవెల అప్పనదొర విగ్రహాలను అప్పటి మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కొణతాల రామకృష్ణ ఏర్పాటు చేశారు. పాఠశాల భవనం శిథిలదశకు చేరడంతో తొలగింపు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న ఆయా మహనీయుల విగ్రహాలను తొలగించకుండా భవనం తొలగింపు పనులు చేపట్టారు. శిథిల భవనం పెచ్చుల కింద ఆయా మహనీయుల విగ్రహాలు నిర్లక్ష్యం వదిలేయడంపై పాఠశాల స్థల దాత కుమారుడు పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేస్తామని కోవెల జనార్థనరావు చెప్పారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆమె సెలవులో ఉన్నట్టు ఉపాధ్యాయులు, సిబ్బంది తెలిపారు.


