క్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్య

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

పరవాడ: మండలంలోని గొర్లివానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో బుధవారం ఒక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన తోకాడ శ్రీను(34) భార్యతో మనస్పర్థలు రావడంతో, కొంతకాలంగా గొర్లివానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని 42వ బ్లాక్‌, ఎఫ్‌–7లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి మల్కాపురంలో నివాసం ఉంటోంది. శ్రీను మాత్రం తన తల్లితో కలిసి అదే కాలనీలో ఉంటూ, పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రీనును.. ఎక్కడికి వెళ్లావంటూ.. తల్లి మందలించింది. అనంతరం, భోజనం చేయడానికి ముందు ఏం కూర వండావు? అని తల్లిని అడిగాడు. ఆమె బెండకాయ కూర వండినట్లు చెప్పగా, శ్రీను గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు అతడు బయటకు రాకపోవడంతో, తల్లి, అతని బావమరిది కలిసి బలవంతంగా తలుపులు తెరిచి చూశారు. అప్పటికే శ్రీను చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement