వెంకటాపురంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వెంకటాపురంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

● ముందురోజు రాత్రే నాగేంద్రునికి పాలు పోయడం గ్రామస్తులకు ఆనవాయితీ

మునగపాక : మండలంలోని వెంకటాపురంలో గురువారం రాత్రి నాగులచవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ గ్రామంలో పూర్వీకుల నుంచి రాత్రి పూట నాగుల చవితి వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా గ్రామస్తులు పొలాలకు వెళ్లి పుట్టలో పాలు పోసి నాగుల చవితి వేడుకను నిర్వహించారు. ఆకాశంలో చుక్కలు చూసిన తరువాత రైతులు, గ్రామస్తులు పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి పూజలు చేశారు. మాజీ సర్పంచ్‌లు సుందరపు కనకప్పారావు,తాతాజీ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చవితి పూజలు ఘనంగా జరుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement