సింహాచలం : నరక చతుర్దశిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సింహగిరిపై నరకాసుర వధ ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలో, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మరో పల్లకిలో వేంచేపు చేస్తారు.అనంతరం సింహగిరి మాడవీధిలో ఇరు పల్లకులను ఎదురెదురుగా ఉంచి నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహిస్తారు. యుద్ధ సన్నివేశాలు, నరకాసుర వధ ఘట్ట విన్నపం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చనున్నారు.కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.


