కాలువలో పడి ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి ఉపాధి కూలీ మృతి

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

రావికమతం: మండలంలోని మేడివాడ పంట కాలువలో గురువారం ఉపాధి కూలీ కాలు జారి పడి మృతి చెందింది. స్థానికులు, మేట్‌ కథనం మేరకు.. మేడివాడకు చెందిన ఉపాధి కూలీ గొర్లి చిలుకమ్మ గ్రామ శివారు దిడ్డిలో ఉపాధి పనికి వెళ్లింది. పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా, పంట కాలువలో ప్రమాదవశాత్తు జారి పడింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో మరణించింది. ఈ విషయాన్ని మేట్‌ శ్రీలక్ష్మి ఏపీవో చిన్నారావు దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏపీవో తెలిపారు. చిలుకమ్మ భర్త గతంలో చనిపోగా, కుమారుడు మహేష్‌తో కలిసి ఉంటోంది. మృతురాలు కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement