పెద ఈశ్వరరావు పాడి మోస్తున్న ఎంపీ గొల్లబాబూరావు, శ్రీపతిరాజులు
ఎస్.రాయవరం : రాజకీయాల్లో పెద ఈశ్వరరావు లాంటి అనుభవజ్ఞుణ్ని కోల్పోవడం చాలా బాధకరమని రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలందించి అందరి మనన్నలు అందుకున్నారన్నారు. ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల్లో కీల పాత్ర పోషించి జెడ్పీటీసీ అభ్యర్థిని పోటీలో దించి పోలింగ్‌కు ఒక్క రోజు ముందు తుదిశ్వాసను విడిచారన్నారు. దార్లపూడిలో పోలిశెట్టి పెద ఈశ్వరరావు అంత్యక్రియల్లో పాల్గొని, పాడె మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు సీనియర్ నాయకులు శ్రీపతిరాజు కూడా ఈశ్వరరావు పాడె మోశారు. పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు, మండల పార్టీ అధ్యక్షుడు మధువర్మ తదితరులు పెద ఈశ్వరరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


