అచ్యుతాపురం రూరల్: జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం అండర్–15 బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు భోగాపురం రగ్బీ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కూండ్రపు నాగ వెంకటరావు గురువారం తెలిపారు. 2011, 2012, 2013, 2014 సంవత్సరాల్లో జన్మించిన క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న జట్టును నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8074714464 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


