అంటు వ్యాధులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అంటు వ్యాధులపై అప్రమత్తం

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

అచ్యుతాపురం రూరల్‌: తుపాను ప్రభావంతో గ్రామాల్లో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామింగ్‌ మేనేజింగ్‌ వైద్యాధికారి ఆర్‌.వెంకటేష్‌ సూచించారు. గురువారం మండలంలో పూడిమడక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. తుపాను అనంతరం పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రతి ఇంటినీ ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజూ సందర్శించి, ప్రజలకు అంటు వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వరాలతో బాదపడుతున్న వారిని గుర్తించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement