అలల ఉధృతికి విరిగిన బోట్లు | - | Sakshi
Sakshi News home page

అలల ఉధృతికి విరిగిన బోట్లు

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

రూ.10 లక్షల ఆస్తి నష్టం

నక్కపల్లి: తుపాను బీభత్సంలో బుధవారం నక్కపల్లి సీఐ మురళి, తహసీల్దార్‌ చిన్నికృష్ణ రాజయ్యపేట, బోయపాడు, దొండవాక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కెరటాల ఉధృతికి రాజయ్యపేట, బోయపాడు తదితర ప్రాంతాల్లో పలువురికి చెందిన బోట్లు, తెప్పలు ధ్వంసమయ్యాయి. అలల తాకిడికి కొట్టుకుపోయిన తెప్పలను మత్స్యకారులు తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకు వచ్చి భద్రపరచుకున్నారు. చాలావరకు తెప్పలు, వలలు, ఇంజన్లు పాడయ్యాయని మత్య్సకారులు తెలిపారు. ఈ రెండు గ్రామాల పరిధిలో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని మత్స్య కారులు అఽధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement