అవినీతి నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలన అందరి బాధ్యత

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

ద్వారకానగర్‌: సమాజంలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా ప్రజలు భయపడకుండా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విజిలెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఏసీబీ రూపొందించిన అవగాహన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించడం ద్వారా పారదర్శకమైన పాలనకు మార్గం సుగమమవుతుందన్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్‌.ఆర్‌.హర్షిత మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగినా, అవినీతి జరిగినా ప్రజలు నేరుగా టోల్‌ ఫ్రీ నంబర్‌:1064, వాట్సాప్‌ నంబర్‌ 94404 40057, ఏసీబీ వెబ్‌సైట్‌లో, కార్యాలయం నంబర్‌: 0866– 2428770లో ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. అదనపు జిల్లా జడ్జి, ఏసీబీ ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement