కె.కోటపాడు: తుపాను గాలులతో గొట్లాం గ్రామంలో కొట్యాడ సూరిబాబు పశవుల పాకపై మంగళవారం రాత్రి సమీపంలో గల తాడిచెట్టు పడింది. సూరిబాబు తన పశువులను పాకలో కడుతున్న సమయంలో పాకపై చెట్టు పడడంతో సూరిబాబు తలకు తీవ్ర గాయమైంది. దీంతో సమీపంలో ఉన్న రైతులు సూరిబాబును బయటకు తీశారు. కుటుంబ సభ్యులు ఆయనను విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సూరిబాబు గ్రామంలో జీరాంజీ పథకం వీఆర్పీగా పని చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ సమాచారాన్ని తెలుసుకున్న ఎంపీడీవో సాంబశివరావు, ఏపీవో ఎస్.అప్పలరాజు సూరిబాబు ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకుంటున్నారు.


